బాగ్దాదీని వెంటాడిన గ్రేట్ డాగ్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 7:09 AM GMT
బాగ్దాదీని వెంటాడిన గ్రేట్ డాగ్..!

వాషింగ్టన్: ప్రపంచ దేశాలను గడగడలాడించిన ఐసీసీ ఉగ్రోన్మాది అబు బకర్‌ అల్‌ బగ్దాదీ హతమయ్యాడు. అయితే బగ్దాదీని తన చివరి గడియాల్లో అమెరికా సైన్యానికి చెందిన శునకాలు వెంటాడయన్నా విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే తెలిపాడు. ఈ వేటలో బగ్దాదీని మట్టుబెట్టే ఆపరేషన్‌లో ఓ శునకం అద్భుతమై సేవలనందించింది. కానీ..ఆపరేషన్‌లో ఈ శునకం స్వల్పంగా గాయాలపాలైంది. అయినా..దాని కర్తవ్యాన్ని మాత్రం పూర్తి చేసింది. ఓ కరుడుగట్టిన ఉన్మాది..ఇక తనకు లోకంలో నూకలు లేవని భావించి ఆత్మాహుతి చేసుకునే వరకూ వేటాడింది. శిరచ్ఛేదనలు, అపహరణలు, హత్యాలతో వేల మందిని పొట్టనబెట్టుకున్న ఆ నరహంతకుడికి ఈ శునకం చుక్కలు చూపించింది.

మరీ ఆ వీర శునకాన్ని చూడలని అందరికీ ఉంటుంది కాదా..! అందుకే ఆ శునకానికి సంబంధించిన చిత్రాన్ని స్వయంగా మోదీ తన ట్విటర్‌ వేదికగా ఫోస్ట్‌ చేశారు. దీనిలో భాగంగా 'అబు బకర్‌ అల్‌ బగ్దాదీని అంతమొందించడంలో గొప్ప పాత్ర పోషించిన అద్భుతమైన శునకాని చెందిన చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. కాని దాని పేరు మాత్రం వెల్లడించలేం' అని ట్రంప్‌ ట్విటలో పేర్కొన్నారు.Next Story