ప్రియాంకా చోప్రా చీలిన డ్రస్సు.. అసలు రహస్యం ఇదే
By రాణి Published on 1 Feb 2020 8:07 AM GMTమనమ్మాయి ప్రియాంకా చోప్రా డ్రస్సు ను గ్రామీ అవార్డు ఫంక్షన్లో చూశారు కదా. బొడ్డు కింద దాకా స్లిట్ ఉన్న ఆ డ్రస్సులో కనిపించాల్సినవే కనిపించి, కనిపించకూడనివి దాచడం ఎంత కష్టమో ఊహించుకోవడం అసాధ్యమేమీ కాదు. కానీ అలాంటి డ్రస్సును కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇరకాటం రాకుండా ధరించేసింది మన ప్రియాంకమ్మ. ఇలాంటి డ్రస్సుల్లో దాచాల్సిన శరీర భాగాలను దాచలేకపోవడాన్ని ఫ్యాషన్ పండితులు వార్డ్ రోబ్ మాల్ ఫంక్షను అనే ముద్దు పేరుతో పిలుస్తారు. ఇంటర్నెట్లో స్టార్ల వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ విడియోలు కుప్పలు తెప్పలుగా కనిపించి నయనానందం చేకూరుస్తుంటాయి.
అలాంటిది మన ప్రియాంకా చోప్రా జోనాస్ (చివరి ముక్క ఆమెకన్నా పదేళ్లు చిన్నవాడైన ఆమె భర్త గారి పేరు లెండి). ఈ సర్వ దర్శన డ్రస్సును అంత అద్భుతంగా ఎలా క్యారీ ఆఫ్ చేసిందో తెలుసా? అందులో ఒక చిన్న ట్రిక్కు ఉంది. రాల్ఫ్ అండ్ రూసో డిజైన్ చేసిన ఈ డ్రస్సు లాంటిదే 2000 ప్రాంతంలో జెన్నిఫర్ లోపెజ్ కూడా వేసుకుంది. అయితే ప్రియాంక డ్రస్సులో మనబోంట్లకు కనిపించనంత ట్రాన్స్ పరెంట్, స్కిన్ కలర్ ముక్క ఒకటుంది. అది రెండు భాగాలను కలిపి ఉంచింది. ఇంత జాగ్రత్తగా కెమరాలకు దొరకకుండా ఉన్న ఆ వస్త్రమే ఆమె వస్త్రాపహరణం కాకుండా కాపాడిందట. ప్రియాంకే స్వయంగా చెప్పే దాకా ఎవరికీ అసలు విషయం తెలియదు.
అవార్డు ఫంక్షన్లో ఫ్యాషన్ రిస్కులు తీసుకోవడానికి తాను సిద్ధంగా లేనని, అందుకే తన జాగ్రత్తలో తానున్నానని అమ్మడు చెబుతోంది. అంతా పకడ్బందీగా ఉంటే తప్ప తాను ఇంట్లోంచి కాలు బయటపెట్టనని ప్రియాంక చోప్రా ఖరాఖండిగా కుండ బద్దలు గొట్టింది. ప్రియాంక మొగుడు జోనాస్ వయసులో చిన్నోడే అయినా పెళ్లిళ్లలో పెద్దోడే. అప్పుడప్పుడు ఏం తోచనప్పుడు జోనాస్ మాజీ భార్యలతో ఫ్యాషన్ టిప్పులు పంచుకుంటుందట మన ప్రియాంకా చోప్రా.