అమరావతి.: ఉద్యోగుల తరహాలోనే అక్టోబర్‌1న వాలంటీర్లకు ప్రభుత్వం జీతాలు జమ చేయనుంది. ఆగస్ట్‌ 15 నుంచి అక్టోబర్ 1 వరకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లక్షా 92వేల 848 మంది వాలంటీర్లకుగాను విధుల్లో లక్షా85వేల 525 మంది ఉన్నారు. లక్షా 50వేల 848 మందికి అక్టోబర్‌ 1 గౌరవ వేతనం రూ.7,500 వేయనున్నట్లు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి తెలిపారు. సకాలంలో ధ్రువపత్రాలు చెల్లించని వారికి అక్టోబర్‌ 1 నుంచి 5 మధ్యలో జీతాలు జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.