నెట్టింట రచ్చ చేస్తున్న చిరూ నక్సలైట్ లుక్..
By Newsmeter.Network Published on 23 Feb 2020 1:13 PM IST
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం' గోవింద ఆచార్య'. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుండగా.. చిరు లుక్ ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. సైరా నరసింహారెడ్డి చిత్రం తర్వాత.. చిరంజీవి నటిస్తున్న చిత్రం.. వరుస విజయాలతో ఊపుమీదున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రానుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇదిలావుంటే.. దసరా రోజున పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా ప్రస్తుతం కోకాపేటలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో చిరు రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నారని, అందులో ఒకటి నక్సలైట్ పాత్ర కాగా మరోటి దేవాదాయ శాఖ అధికారి పాత్ర.
అయితే.. సినిమా షూటింగ్ లో భాగంగా నక్సలైట్ గెటప్ లో ఉన్న చిరంజీవి లుక్ లీకైంది. ఫోటోతో పాటు ఓ వీడియో కూడా లీక్ అయింది. అయితే దీనిపైన వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ అప్రమత్తమైంది. వెంటనే సదరు వీడియోను ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల నుంచి తొలగిచింది. ఫోటోల్ని మాత్రం తొలగించలేదు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ స్టిల్ ఎవరు లీక్ చేశారన్నదానిపై చిత్ర యూనిట్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.
కాగా.. ఇటువంటి లీకుల వ్యవహారాలపై సీరియస్ గా వుండే చిరు ఎలా స్పంధిస్తారో చూడాలి మరి. కొద్ది రోజుల క్రితం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ నుండి కూడా ఒక ఫోటో లీకవగా.. ప్రస్తుతం గోవింద ఆచార్య వంతైంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.