అల వైకుంఠపురంలో విలన్ గుర్తున్నాడా? మంచి ఒడ్డూ పొడుగూ ఉన్న ఆ అందగాడు చాలా మార్కులే కొట్టేశాడు. మలయాళ ఇండస్ట్రీలో పాపులర్ గా ఉన్న గోవింద్ పద్మ సూర్య గురించి ఇప్పుడందరూ మాట్లాడుకుంటున్నారు. నిజానికి గోవింద్ పద్మ సూర్య డబుల్ ధమాకా కొట్టేశాడు. ఎందుకంటే దాదాపుగా ఒకే సమయంలో తమిళ సినిమా “కీ”, తెలుగు సినిమా “అలవైకుంఠపురంలో” లలో విలన్ పాత్రలను కొట్టేశాడు. రెండూ దాదాపు ఒకే సమయంలో రిలీజ్ అయ్యాయి. రెండూ భారీ హిట్లను నమోదు చేసుకున్నాయి. ఇప్పుడు గోవింద్ పద్మసూర్య రొట్టె విరిగి నేతిలో పడింది.

అయితే మొదట్లో ఈ రెండు సినిమాల్లోనూ రోల్ ఆఫర్ చేసినప్పుడు గోవింద్ కాస్త తటపటాయించాడు. అయితే రెండు పాత్రలూ బలమైనవి కావడంతో ఒప్పుకున్నాడు. కీ లో జీవా హీరో. అలవైకుంఠపురంలో లో అల్లు అర్జున్ హీరో. “వేరే పరిశ్రమల్లో పనిచేయాలన్న కోరిక చాలా రోజుల నుంచే ఉంది. కానీ నాకు విలన్ రోల్స్ తప్ప హీరో రోల్స్ ఆఫర్ చేయరు కదా. అందునా అల్లు అర్జున్ తో నటించడమంటే మాటలా? అందుకే ఈ ఆఫర్లను ఒప్పేసుకున్నాను” అంటారు గోవింద్ పద్మసూర్య. కీ చిత్రంలో తన నటనను చూసి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంప్రెస్ అయ్యాడని, ఆ తరువాతే అల వైకుంఠపురంలోకి వచ్చేశానని ఆయన అంటున్నారు. దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ ల కాంబోను చూసే తాను ఈ చిత్రాన్ని ఒప్పుకున్నానని అతను అంటున్నాడు. ఈ చిత్రం తరువాత ఇప్పుడు ఆఫర్లు కుప్పతెప్పలుగా వస్తున్నాయని ఆయన చెబుతున్నాడు.

చిత్రం రిలీజ్ ఫంక్షన్లో అల్లు అర్జున్ గోవింద్ ను సోదరుడుగా పేర్కొన్నాడు. బన్నీ చాలా మంచి వాడని, త్వరగా దోస్తే చేస్తాడని, ఆయన ఫ్యాన్లు ఇప్పుడు తనను కూడా ఆదరిస్తున్నారని గోవింద్ చెబుతున్నాడు. తన నెక్స్ ట్ సినిమాల గురించి బన్నీ ఫ్యాన్లు తనను అడుగుతున్నారని కూడా ఆయ అన్నారు.

Newsmeter.Network

Next Story