• క్యూబిక్ సహకారంతో సంచలన నిర్ణయం
  • కాంటాక్ట్ లెస్ చెల్లిపులకు శ్రీకారం
  • రైడ్ర్షిప్ పెంచడమే లక్ష్యం..!

గూగుల్ పే, క్యూబిక్ సంస్థలు రవాణా రంగంలోకి సంయుక్తంగా అడుగుపెట్టాయి. ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో ప్రయాణికుల చెల్లింపులు సరళీకృతం చేయడానికి ఇక నుంచి క్యూబిక్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్స్ , గూగుల్ సహకరిస్తాయి.ప్రయాణికులు టిక్కెట్ బుక్ చేసుకోవడానికి, బస్సుల సమాచారాన్ని రియల్ టైంలో తెలుసుకోడానికి ఆండ్రాయిడ్ ఫోన్‌ మీ చేతిలో ఉంటే చాలు. క్యూబిక్ కార్పొరేషన్ గూగుల్ పేతో కాంటాక్ట్‌లెస్ ట్రాన్సిట్ కార్డులను అనుసంధానించడానికి గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది,.

ఇది ప్రయాణికులకు వేగంగా, సులభంగా వినియోగించుకునేలా ఉపయోగ పడుతుంది. ప్రయాణికుల ప్రయాణాలకు అవసరమైన చార్జీల చెల్లింపును మరింత సులభతరం చేస్తుంది. మొబైల్ ఫోన్ వినియోగదారులు ఇట్టే చెల్లించ వచ్చు. క్యూబిక్ రవాణా ఏజెన్సీలకు ఈ సహకారం అందిస్తుంది. లండన్, న్యూయార్క్, మయామి వంటి నగరాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న కాంటాక్ట్‌లెస్ చెల్లింపులను మెరుగుపరచడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో తోడ్పడుతుంది

ఈ కొత్త విధానాన్ని ఎన్ని నగరాలకు విస్తరిస్తారనే విషయాన్ని క్యూబిక్ ప్రకటించలేదు. కాని.. న్యూయార్క్, వాంకోవర్, సిడ్నీ, శాన్ డియాగో, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో , లండన్ వంటి నగరాల్లో సేవలను విస్తృతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ప్రజా రవాణా వ్యవస్థను వీలైనంత మందికి సౌకర్యవంతంగా మార్చడమే తమ లక్ష్యం.” అన్నారు గూగుల్ పే ఉత్పత్తి నిర్వహణ డైరెక్టర్ అంబరీష్ కెంగే .

భారత్ లోఇప్పటికే గూగుల్ పే తనదైన మార్కెట్ ను సృష్టించుకుంది. అయితే..రవాణా రంగానికి సంబంధించి భారత్ లోకిఎప్పుడు అడుగు పెడతారో స్పష్టమైన ప్రకటన చేయలేదు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.