టిక్‌టాక్ ప్రియులకు గుడ్ న్యూస్
By సుభాష్ Published on 8 July 2020 5:01 PM ISTటిక్‌టాక్ ప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఇన్‌స్టాగ్రామ్. టిక్‌టాక్‌లో 15 సెకన్ల నిడివి ఉన్న చిన్న చిన్న వీడియోస్ ద్వారా ఎంతో మంది స్టార్‌లుగా మారిపోయి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే దేశంలో టిక్‌టాక్‌పై నిషేధం విధించడంతో లక్షలాది మంది ఫాలోవర్లు కోల్పోయారు. ఒక్కసారిగా టిక్‌టాక్ బ్యాన్ కావడంతో ఏం చేయాలో అర్థం కాక ఆందోళనలో పడిపోయారు. అయితే వీరందరికి ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పేరుతో 15 సెకన్ల వీడియోలు పోస్టు చేసే ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇందుకు సంబంధించిన ట్రైల్ రన్స్ కూడా జరుగుతున్నాయి. దీని కోసం బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశౄలతోపాటు ఇండియా కూడా చలా మంది కంటెంట్ రైటర్లను అడిగి ఇన్‌స్టాగ్రామ్ సూచనలు తీసుకుంది. భారత్‌లో దీనికి సంబంధించిన టెస్టింగ్లో భాగంగా ప్రముఖ టిక్‌టాక్ స్టార్‌లను తమ వీడియోలు పోస్టు చేయాలని కోరింది.
ఇండియాలో బుధవారం సాయంత్రం 7.30 గంటల నుంచి ఇన్‌స్టాగ్రామ్ వీడియో టెస్టింగ్ మొదలు కానుంది. కాగా, టిక్‌టాక్, ఫేస్ బుక్‌లో పాపులర్ అయినవారిని వీడియోలు పోస్టు చేయాలని ఇన్‌స్టాగ్రామ్ కోరింది. రీల్‌లో కూడా టిక్‌టాక్‌లో వచ్చే మాదిరిగానే బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యాజిక్, డైలాగులు ఉంటాయని తెలిపింది. అంతేకాదు టిక్‌టాక్‌లో ఉండే విధంగా అన్ని ఆప్షన్లు ఉంటాయని తెలిపింది. ఇది కనుక విజయవంతం అయితే టిక్‌టాక్ లాగే దూసుకుపోనుంది ఇస్టాగ్రామ్.