ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆర్టీసీ కార్మికులకు శుభవార్త

By సుభాష్  Published on  20 Aug 2020 12:51 AM GMT
ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆర్టీసీ కార్మికులకు శుభవార్త

ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించింది ఏపీ ప్రభుత్వం. కార్మికులకు రూ.50 లక్షల కోవిడ్‌ బీమా ఇచ్చేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీని కార్మికులకు వర్తింపజేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన 36 మందికి బీమా అమలు అయ్యేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు మృతుల వివరాలు సహా ధృవపత్రాలు పంపాలని ఆర్‌ఎంలను ఆర్టీసీ ఎండీ ఆదేశించారు. ఈ నెల 28వ తేదీ లోపు పత్రాలను ప్రధాన కార్యాలయానికి పంపాలని సూచించింది. కరోనా బీమా వర్తింపజేయడంపై కార్మిక పరిషత్‌ సహా ఇతర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ ఎండీకి ధన్యవాదాలు తెలిపారు.

Next Story
Share it