మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్‌ శుభవార్త

By సుభాష్  Published on  24 Oct 2020 10:36 AM GMT
మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్‌ శుభవార్త

జగన్‌ ప్రభుత్వం మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈనెల 26న దసరా ఆప్షనల్‌ హాలీడేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సె లవును ఈ నెల25 నుంచి 26కు మార్చాలని మహిళా ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల అభ్యర్థనల మేరకు దసరా సెలవును ఈనెల 25 నుంచి 26కు మారుస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే తమకు అక్టోబర్‌ 26న దసరా సెలవుగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్ర ఉద్యోగ సంఘాలు కోరడంతో ఈనెల 26న సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఏపీ మహిళా ఉద్యోగులు కూడా జగన్‌ ప్రభుత్వాన్ని కోరగా, దానికి ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.

Next Story
Share it