అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త..రూ.265 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 11:29 AM GMT
అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త..రూ.265 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

తూ.గో జిల్లా : ఏపీ సర్కార్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రి గోల్డ్ బాధితులకు శుభ వార్త అందించింది. డిపాజిట్లు చెల్లించేందుకు మొదటి విడత కింద వైఎస్ జగన్ సర్కార్ రూ.265 కోట్లు విడుదల చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సీఎం వైఎస్ జగన్ అనేక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కన్నబాబు చెప్పారు. అయినా..ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం రూ.65వేల కోట్ల పెండింగ్ బిల్లులతో ఖాళీ ఖజానా వైఎస్ఆర్ సీపీ సర్కార్‌కు ఇచ్చిందన్నారు. రూ.11వేల కోట్ల అగ్రిగోల్డ్ డిపాజిట్లు చెల్లిస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడతగా రూ.265 కోట్లు విడుదల చేశారన్నారు. రూ.10వేల లోపు ఉన్న డిపాజిటర్లకు ముందు చెల్లించాలని సీఎం ఆదేశించారన్నారు. ప్రైవేట్ సంస్థకు చేసిన డిపాజిట్లను ప్రభుత్వం చెల్లించడం ఇదే తొలిసారి మంత్రి కన్నబాబు చెప్పారు. ఏ ప్రభుత్వం ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదని..సీఎం వైఎస్ జగన్‌ ఒక్కరే ధైర్యంగా డెసిషన్ తీసుకున్నారని చెప్పారు మంత్రి కురసాల కన్నబాబు.

అగ్రి గోల్డ్ బాధితులను ఆదుకోవడం హర్షనీయం- సీపీఐ రామకృష్ణ

అగ్రిగోల్ద్ బాధితులకు రు.264.99 కోట్లను విడుదల చేయడం హర్షణీయమన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించిన మిగిలిన నిధులను కూడా విడుదల చేసి బాధితులు ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. రూ.264.99 కోట్ల విడుదల అగ్రిగోల్ద్ కస్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సాధించిన విజయమన్నారు. బాధితుల తరపున పోరాడిన అసోసియేషన్ కు అభినందనలు తెలిపారు సీపీఐ రామకృష్ణ.

Next Story
Share it