పరుగులు పెడుతున్న బంగారం.. రూ.50లకు చేరువలో..
By సుభాష్ Published on 12 May 2020 6:24 PM IST
పసిడి ధర పరుగులు పెడుతోంది. సోమవారం హైదరాబాద్‌లో బంగారం ధర తగ్గినా.. మంగళవారం మాత్రం కాస్త పెరిగింది. 10 గ్రాములపై 120 పెరిగింది. గత వారమే హైదరాబాద్‌లో రూ. 47వేల మార్క్‌ను దాటేసింది. తాజాగా రూ.50వేలకు చేరువలో ఉంది. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47, 420 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉంది, ఇక వెండి కూడా స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 43,100 ఉంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.32 శాతం దిగొచ్చింది. దీంతో ఔన్స్‌కు 1708.50 డాలర్లు దిగొచ్చింది. ఇక వెండి ధర ఔన్స్‌కు 0.55శాతం పెరుగుదలతో 15.86 డాలర్లకు ఎగబాకింది.
కాగా, గ్లోబల్ మార్కెట్ బంగారం ధరల్లో మార్పులు, ద్రవ్యోల్బణం, పసిడి నిల్వలు, వడీరేట్లు, జువెలరీ మార్కెట్ తదితర అంశాలు ధరలపై ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.