భారీగా తగ్గిన పసిడి ధర.. ఇప్పుడు ఎంతంటే.?

By అంజి  Published on  17 March 2020 10:06 AM GMT
భారీగా తగ్గిన పసిడి ధర..  ఇప్పుడు ఎంతంటే.?

ఈ వారంలో మరోసారి బంగారం ధర భారీగా తగ్గింది. గత ఐదు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. ఈ రోజు కూడా ఇదే ట్రెండింగ్‌ కొనసాగింది. బంగారానికి తోడుగా వెండి కూడా ఇదే దారి పట్టింది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధర రూ.480 తగ్గింది. దీంతో 1.2 శాతం మేర బంగారం ధర దిగొచ్చినట్లైంది. అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర తగ్గడం సహా దేశీ మార్కెట్‌లోనూ జువెల్లర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్‌ తగ్గిపోవడంతో బంగారంపై ప్రతికూల వాతావరణం ఏర్పడిందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 10 గ్రాముల బంగారం ధర రూ.39,037కు పతనమైంది. దేశీ మార్కెట్‌లో గత ఐదు రోజులుగా బంగారం దాదాపు రూ.5 వేలు పడిపోవడం గమనార్హం. బంగారం ధర భారీగా క్షీణిస్తూ వస్తోంది.

ఇక వెండి ధర కూడా భారీగా తగ్గింది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.35,593గా ఉంది. గత సెషన్‌లో వెండి ధర ఏకంగా రూ.4,200కు దిగొచ్చింది. దీంతో వెండి ధర దాదాపు 1.7 శాతం క్షీణించింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదుడుకులే ఇందుకు కారణమని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర చాలా తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 026 శాతం తగ్గుదలతో 1482.75 డాలర్లకు వచ్చింది. కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచ దేశాల స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. బంగారంలో తమ పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కు తీసుకుంటున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు కరోనాపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాను ఆర్థిక మాంద్యం వెంటాడొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేయడంతో.. అక్కడి స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్ప కూలాయి.

హైదరాబాద్‌ మార్కెట్‌లో మంగళవారం పసిడి ధర దిగివచ్చింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 42,300 ఉండగా, అదే సమయంలో 22 క్యాకెట్ల బంగారం ధర 10 గ్రాముల బంగారం రూ.38,700లగా ఉంది.

Next Story