పసిడి పరుగులు.. రూ. 50వేలు దాటిన బంగారం ధర

By సుభాష్  Published on  23 Jun 2020 3:26 AM GMT
పసిడి పరుగులు.. రూ. 50వేలు దాటిన బంగారం ధర

బంగారం ధర పరుగులు పెడుతోంది. పసిడి పరుగులు పెడుతుండటంతో బంగారం ప్రియులకు టెన్షన్‌ మొదలైంది. ఇప్పుడు ఏకంగా రూ.50వేలు దాటేసింది. తాజాగా హైదరాబాద్‌లో పసిడి ధర మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 200 పెరిగి ప్రస్తుతం రూ.46,300 ఉండగా, ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి, ప్రస్తుతం రూ.50,590కు ఎగబాకింది.

ఇక ఢిల్లీలో కూడా పసిడి ధరలు ఎగబాకాయి. 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.240 పెరిగి రూ.47వేలకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 230 పెరిగి ప్రస్తుతం రూ. 48,200కి చేరుకుంది.

ఇక కిలో వెండి రూ.48,800లకు చేరుకుంది.

అయితే అంతర్జాతీయ బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్‌ ఉండటం, స్థానిక పరిస్థితుల కారణంగా పసిడి ధరల్లో హెచ్చు, తగ్గులు చోటు చేటు చేసుకుంటున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ బంగారం ధరల్లో మార్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్నబంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతున్నాయి

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర:

హైదరాబాద్‌ : రూ.46,300

ఢిల్లీ : రూ.47,010

చెన్నై : రూ. 46,300

ముంబాయి : రూ. 46,610

బెంగళూరు : రూ. 45,510

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర:

హైదరాబాద్‌ : రూ. 50,590

ఢిల్లీ : రూ. 48,200

చెన్నై : రూ.50,590

ముంబాయి : రూ.47,610

బెంగళూరు : రూ. 49,760

Next Story