భగభగమంటున్న బంగారం..వెండి కూడా పసిడి మార్గంలోనే..
By రాణిPublished on : 6 Jan 2020 6:23 PM IST

ఖుద్స్ ఫోర్స్ జనరల్ ఖాసీం సులే ఇమానీ మరణంతో ఇరాన్ - అమెరికా దేశాల మధ్య శత్రుమేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా రెండోరోజు పసిడి ధర భారీగా పెరిగింది. రెండ్రోజుల వ్యవధిలో బంగారం ధర ఒక్కసారిగా రూ.1800కు పైగా పెరిగింది. సోమవారం ఒక్కరోజే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.41,730కి చేరింది. దీంతో వెండి ధర కూడా పెరిగింది. వెండి ధర రూ.1105 పెరిగడంతో కిలో వెండి రూ. 49,430 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్లలో సైతం వెండి, బంగారం ధరలు పెరిగాయి. కమాడిటీ ఎక్స్చేంజ్ లో ఔన్సు బంగారం ధర 2.3 శాతం పెరిగింది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం కూడా బంగారం ధర పెరుగుదలకు ఒక కారణంగా తెలుస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో బంగారం పెట్టుబడులు సురక్షితమని పెట్టుబడిదారులు భావించారు.
Next Story