తూ.గో.జిల్లా: గోదావరి నదిలో మరో బోటు బోల్తా పడింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ఇటీవల బోటు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇంకా కొన్ని మృతదేహాలు ఇప్పటికీ దొరకలేదు. దీంతో ఎన్.డి.ఆర్‌.ఎఫ్ బృందాలు వారి కోసం గాలిస్తున్నాయి.  గోదావరిలో ఉధృతి పెరగడంతో.. ఎన్.డి.ఆర్‌.ఎఫ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బోటు.. ఒక్కసారిగా బోల్తాపడింది. కాగా.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. సిబ్బంది క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో… అక్కడున్నవారందరూ ఊపిరి పీల్చుకున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.