రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం బృందం..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Oct 2019 8:13 AM GMT
రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం బృందం..

తూర్పుగోదావరి: కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన టూరిస్ట్‌ బోటును వెలికి తీసేందుకు మరోసారి ధర్మాడి సత్యం బృందం ప్రయత్నం చేస్తోంది. బోటు వెలికితీతకు జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి అనుమతి తెలిపారు. దీంతో బోటును వెలికితీసేందుకు కావాల్సిన సరంజామాతో ధర్మాడి సత్యం బృందం గోదావరి నదికి చేరుకున్నారు. ఇనుప వైర్లను గోదావరి నదిలోకి వదులుతున్నారు. క్రేన్లకు ఇనుపవైర్లు కట్టి.. ఆ వైర్లకు యాంకర్‌ వేసి నీటిలోకి వదులుతోంది. లంగర్‌కు బోటు తగిలితే వెలికి తీయాలన్నది వారి ప్లాన్‌. అయితే బోటు మునిగి నెల రోజులు కావడంతో అది బురదలో కూరుకుపోయినట్టుగా తెలుస్తోంది. బోటు మెత్తబడి ముక్కలు విరిగిపోయి ఉంటుందని వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే ధర్మాడి సత్యం బృందంకు ఇలాంటి పడవలను బయటకు తీసిన అనుభవం ఉండంటంతో.. బోటును బయటకు తీసేందుకు సత్యం బృందం విశ్వప్రయత్నాలు చేస్తోంది. వారం కిందట ఇలాంటి ప్రయత్నాలనే సత్యం బృందం చేసింది. అయితే ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో బోటుకు వెలికితీసే పనులు వాయిదా పడ్డ విషయం తెలిసిందే.

Next Story
Share it