గోవా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో స‌త్తా చాటిన తెలుగోడు 'దేవ్ పిన్'

By అంజి  Published on  23 Nov 2019 6:35 AM GMT
గోవా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో స‌త్తా చాటిన తెలుగోడు దేవ్ పిన్

ప్రపంచంలోనే అతి పెద్ద మానవ సంక్షోభం సిరియాలోనే 2011 నుండి 2018 వరకు జరిగింది. ఈ మారణ హోమంలో ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో చాలామంది చిన్న పిల్లలు కూడ వున్నారు. దీనికి మూల కారణం నాయకుల యొక్క అహం, స్వార్ధం, అధికారం కోసం అత్యాశ కోసం జరిగిన ఈ సంఘటనలో దేశం మొత్తం నాశనం అయ్యింది. ఈ మారణహోమంలో శిధిలాల మధ్య దొరికిన ఒక ఐదేళ్ళ పిల్లోడిని హాస్పిటల్ తీసుకునివెళ్ళితే అతను చనిపోయే ముందు చివరి పరిస్థితిల్లో చెప్పిన మాటలు 'i'm gonna tell god everything'. ఆ పిల్లవాడి మాటల ఉద్దేశం ఆధారంగా అరబిక్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో హాలివుడ్ లోని సిరియన్ యాక్టర్స్ తో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ షార్ట్ ఫిల్మ్ ప్రాజెక్ట్ తెరకెక్కించడం జరిగింది.

ఈ షార్ట్ ఫిల్మ్ పోస్టర్ ని ముంబాయిలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ లాంచ్ చేశారు. వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ అవార్డులు వచ్చాయి. అలాగే నార్వే ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రం అవార్డు అందుకుంది. ఇప్పుడు గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఒక స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. గవర్నమెంట్ అఫ్ ఇండియా కండక్ట్ చేసే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రత్యేకమైనది. ఆసియాలో కాకుండ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇంటర్నేషనల్ సెక్షన్ లో మన తెలుగు వాడు చేసిన ఫిల్మ్ సెలెక్ట్ అయ్యింది.

గోవా ఫిల్మ్ ఫెస్టివల్ అనేది షార్ట్ ఫిల్మ్స్‌కి ప్రాముఖ్యత ఇవ్వరు, కేవలం ఆస్కార్ కి నామినేట్ అయ్యే ఫిల్మ్స్, ఆస్కార్ అవార్డ్స్ వచ్చే ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్‌కి మాత్రమే ఎక్కువగా ప్రాధ్యానత ఇస్తారు. మొట్ట మొదటిసారిగా గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ షార్ట్ ఫిల్మ్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ జరుపుకుంది. ఇండియన్ ఫిలిమ్స్‌కి ప్రత్యేకంగా ఇండియన్ పనోరామ అనే ఒక సెక్షన్ వుంది. దానిలో మన దేశంలో గోప్ప సినిమాలు సెలెక్ట్ అవ్వుతాయి.

ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించిన ఐదేళ్ళ పిల్లాడు క్యారెక్టర్ చేసిన వివాన్ బిసోయి ఇండియా కి చెందినవాడు కావడం విశేషం. అంతే కాకుండా ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ వాసు దేవ్, కెమెరామెన్ హరి వేదాంతం కూడ ఇండియన్ కి చెందినవారు అవ్వడం విశేషం. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో తెలుగు ఇండస్ట్రీ నుంచి F2 సినిమా ఒక్కటే ఇండియన్ పరోనామా కమర్షియల్ క్యాటగిరిలో సెలెక్ట్ అయ్యింది, దాని తర్వాత ఇంటర్నేషనల్ సెక్షన్ లో ఇండియా నుంచి సెలెక్ట్ అయ్యిన ఏకైక షార్ట్ ఫిల్మ్ 'i'm gonna tell god everything'.

Next Story