గుంటూరు. ఏపీ రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో కబ్జాలకు తెరలేసింది. అడవి తక్కెళ్లపాడు గ్రామంలో 15 ఎకరాల భూమిని కబ్జా చేశారు. రాత్రికి రాత్రే పొలాల్లో కర్రలు పాతారు. కబ్జారాయుళ్లు తెలివిగా దళిత సంఘాలను తెర ముందు పెట్టారు. కబ్జా చేసింది వైసీపీ నేతలనే ఆరోపణలు ఉన్నాయి. అయితే..కబ్జాదారులు ఏపీ సీఎం జగన్‌ పేరు వాడుకోవడం గమనార్హం. పేదలకు జగన్ ఇళ్ల స్థలాల ఇస్తాడని చెబుతున్నారు. భూ యజమానులు మాత్రం నల్లపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తమ దగ్గరున్న డాక్యుమెంట్లను పోలీసులకు అందజేశారు. గతంలో ఇది ప్రభుత్వ భూమి అని..అందుకే గుడిసెలు వేస్తున్నామని కబ్జాదారులు వాదనకు దిగడం గమనార్హం.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.