నిలిచిపోయిన జీమెయిల్ సేవలు
By సుభాష్ Published on 20 Aug 2020 1:31 PM ISTజీమెయిల్ సేవలకు మరోసారి ఆటంకం ఏర్పడింది. దాదాపు గంట నుంచి మెయిల్ పంపుతున్నా, ఫైల్ అటాచ్ చేస్తున్నా.. సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో యూజర్లు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా Gmail సహాయం సేవలు చేసే వారికి పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో జీమెయిల్ డౌన్ అన్న హ్యాష్ ట్యాగ్ ట్రెండవుతోంది. కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల్లో జీమెయిల్ సేవలు నిలిచిపోయాయి. ఇక ఈ విషయాన్ని గూగుల్ కూడా ధృవీకరించింది. మరో వైపు సాంకేతిక సమస్యలను పునరుద్దరించేందుకు గూగుల్ బృందం శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, రెండు నెలల్లో Gmail షట్‌డౌన్ కావడం ఇది రెండోసారి. జూలైలో యూజర్లు లాగిన్ కూడా కాలేకపోయారు. దీంతో రంగంలోకి దిగిన గూగుల్ టీమ్ సమస్యను పరిష్కరించింది. అయితే జీమెయిల్‌లో సమస్యలు తలెత్తినట్లు ఫిర్యాదులు వచ్చాయన్న గూగుల్.. జీమెయిల్ సేవలకు ఎందుకు అంతరాయం ఏర్పడిందో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా, ఈ విషయంపై విచారణ జరుపుతున్నామని, త్వరలో మరింత సమాచారం వెల్లడిస్తామని గూగుల్ చెప్పుకొచ్చింది.