ముంబై: జియో కొత్త నెలవారి ప్రణాళికను ప్రకటించింది. ఇటీవల నిమిషానికి 6 పైసల చార్జీ విధించిన సంగతి తెలిసిందే .అయితే..దీనిపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.దీంతో టెలికాం సంస్ధ జియో దిగొచ్చింది. అంతేకాదు..వినియోగదారులను ఆకట్టు కోవడానికి కొత్త ప్రణాళికతో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఉచిత ఐయూసీ కాల్స్ ఆఫర్స్‌తోజియో ఆల్ ఇన్‌ వన్ ప్లాన్స్‌ సోమవారం ఓ ప్రకటన చేసింది. జియోయేతర మొబైల్‌ నంబర్లకు వెయ్యి మిషాల ఉచిత టాక్‌టైమ్‌ ఆఫర్‌ చేసింది. దీంతోపాటు ఎప్పటిలాగే జియో టు జియో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయం కల్పించారు.

ఈ కొత్త ప్లాన్స్‌ ప్రకారం నెలకు రూ. 222, రెండు నెలలకు రూ. 333, మూడు నెలలకు రూ. 444 లు ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు .జియో కస్టమర్లు తమ ప్లాన్స్‌ను రూ. 111తో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని పేర్కొంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.