అక్షరాలా రెండున్నర లక్షల జరిమానా!!!

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 20 Sept 2019 3:50 PM IST

అక్షరాలా రెండున్నర లక్షల జరిమానా!!!

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ కొరడా ఝులిపించింది. విచక్షణారహితంగా రోడ్లపై చెత్త వేస్తే సహించేదిలేదనే సంకేతాలు పంపింది. నిర్మాణం జరుగుతున్న స్థలాల దగ్గర పారిశుద్ధ్య విలువలు పాటించకపోతే కఠిన చర్యలుంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిర్మాణ స్థలం దగ్గర మురుగు నీరు తొలగించని కారణంగా మియాపూర్‌కు చెందిన డాల్పిన్ బిల్డర్‌కు భారీ జరిమానా విధించారు. చందానగర్‌ జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ స్వయంగా వెళ్లి అక్షరాలా రెండున్నర లక్షల రూపాయల జరిమానా విధించారు.

Next Story