'చ‌హ‌ల్.. నిన్ను బ్లాక్ చేస్తున్నా..'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 April 2020 12:05 PM GMT
చ‌హ‌ల్.. నిన్ను బ్లాక్ చేస్తున్నా..

టీమ్ఇండియా స్పిన్న‌ర్ య‌జ్వేంద్ర చహ‌ల్ చేసే సంద‌డి అంతా ఇంతా ఉండ‌దు. బంతితో బ్యాట్స్‌మెన్‌ను క‌ట్టి ప‌డేసే ఈ లెగ్ స్పిన్న‌ర్.. మ్యాచ్ అనంత‌రం చ‌హ‌ల్ టీవీ పేరుతో ఆట‌గాళ్లను ఇంట‌ర్వ్యూలు చేస్తూ సంద‌డి చేసేవాడు. చ‌హ‌ల్ చేసే ఇంట‌ర్వ్యూల‌ను ఎందో మంది అభిమానులు ఉన్నారు. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యాడు. లాక్‌డౌన్ కాలంలో.. సోష‌ల్ మీడియాలో త‌రుచూ త‌న స‌హ‌చ‌ర క్రికెట‌ర్ల‌ను ఆట‌ప‌ట్టిస్తుంటాడు. తాజాగా వెస్టిండిస్ ఆట‌గాడు క్రిస్ గేల్ ఆగ్ర‌హానికి గుర‌య్యాడు.

చహ‌ల్ నువ్వు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండు, నీ టిక్‌టాక్ వీడియోల‌తో విసుగెత్తిపోయా. . నీ అకౌంట్‌ను బ్లాక్ చేయ‌మ‌ని టిక్‌టాక్ వాళ్ల‌కు చెబుతా. నా జీవితంలో నిన్న మ‌ళ్లీ చూడాల‌నుకోవ‌ల్లేదు. నిన్ను భ‌రించ‌లేక‌పోతున్నాం. అందుకే నిన్ను బ్లాక్ చేస్తున్నా. అంటూ గేల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో చహల్‌తో మాట్లాడుతూ అన్నాడు. కాగా.. బెంగ‌ళూరు రాయల్ ఛాలెంజ‌ర్స్ త‌రుపున గేల్‌, చ‌హ‌ల్ క‌లిసి ఆడిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల విరాట్ కోహ్లీ కూడా ఏబీ డివిలియ‌ర్స్‌తో ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడుతూ.. చాహ‌ల్‌ను ట్రోల్ చేశారు. అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడే ఆట‌గాడు ఇలా చేస్తాడంటే నువ్వ‌స్స‌లు న‌మ్మ‌లేవు. చాహల్‌కు ఇప్పుడు 29 ఏళ్లు. ఒక‌సారి అత‌డి టిక్‌టాక్ వీడియోలు చూడు.. ఖ‌చ్చింతంగా అత‌నో జోక‌లా ఉంటాడు అని కోహ్లీ.. డివిలియ‌ర్స్‌తో చెప్పాడు.

క‌రోనా మ‌హ‌మ్మారి ముప్పుతో క్రీడారంగం కుదేలైంది. దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ఆట‌గాళ్లు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. ఇక మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) నిర‌వ‌ధికంగా వాయిదా వేసింది. అనుకోకుండా ల‌భించిన ఈ విరామాన్ని క్రికెట‌ర్లు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి హాయిగా కాలం గ‌డుపుత‌న్నారు.

Next Story