రాంగ్ థింగ్స్‌ లోనే ఎక్కువ డ‌బ్బులొస్తాయి.. సిన్సియ‌ర్ అంటే కుద‌ర‌దు : గాయ‌త్రి గుప్తా

By సుభాష్  Published on  31 Jan 2020 7:49 AM GMT
రాంగ్ థింగ్స్‌ లోనే ఎక్కువ డ‌బ్బులొస్తాయి.. సిన్సియ‌ర్ అంటే కుద‌ర‌దు : గాయ‌త్రి గుప్తా

సినీ ఇండ‌స్ట్రీలో ఇంపార్టెంట్ స్ట్ర‌గుల్ ఫైనాన్షియ‌ల్‌. అటువంటిది సిన్సియ‌ర్‌గా ఉంటా, క్యారెక్ట‌ర్స్ కోసం క‌ష్ట‌ప‌డ‌తానంటే మాత్రం ఫైనాన్షియ‌ల్ స్ట్ర‌గుల్స్‌ త‌ప్ప‌వు. రాంగ్ థింగ్స్‌ లో వెళితే మాత్రం డ‌బ్బుకు డ‌బ్బు.. పేరుకు పేరు వ‌స్తుంది. మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేయ‌గ‌ల‌ను, అవ‌కాశాలు రాక‌పోయినా 15 ఏళ్లు బ‌త‌క‌గ‌లుగుతాన‌న్న ధైర్యం ఉన్న అమ్మాయిలు మాత్ర‌మే ఇండ‌స్ట్రీకి రండి..లేక‌పోతే రాకండంటూ సినీ న‌టి గాయ‌త్రి గుప్తా చెప్పుకొచ్చింది.

న్యూ జ‌న‌రేష‌న్ డైరెక్ట‌ర్స్‌, టెక్నీష‌న్స్ కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌తో ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నారు. క‌నుక సినిమా అవ‌కాశాలు దొరుకుతాయ‌న్న న‌మ్మ‌కం క‌లుగుతుంది. బై ల‌క్ వ‌ర్క‌వుట్ అవ్వొచ్చు. ఏదేమైనా ముందుగానే వ‌ర‌స్ట్‌ కి ప్రిపేర్ అయితే అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాలు చేసే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. సినీ ఇండ‌స్ట్రీ అనేది డేంజ‌రస్ ప్లేస్ కాక‌పోయినా ఫైనాన్షియ‌ల్‌గా ఇరుక్కున్నా ప‌ర్లేదు అని ముందుగానే ప్రిపేర్ అయి వ‌స్తే హ్యాప్పీ.

కేవ‌లం ఆడ‌వాళ్ల‌కు మాత్ర‌మే కాదు.. సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌తి ఒక్క‌రూ స్ట్ర‌గుల్స్‌ ను ఫేస్ చేయాల్సిందే. బాగా క‌ష్ట‌ప‌డాలి. ఎమోష‌న‌ల్‌గా దెబ్బ‌లు త‌గులుతాయి. న‌మ్మ‌కం క‌లిగేంత వ‌ర‌కు ఎవ‌రూ ఎంక‌రేజ్ చేయ‌రు. మీరేంటో ప్రూవ్ అయ్యే వ‌ర‌కు ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఉన్న వారు ల‌క్కీగా అంత ఎత్తుకు ఎదిగారా..? లేక స్ట్ర‌గుల్స్ ఫేస్ చేశారా..?అన్న‌ది వారినే అడిగితే తెలుస్తుంది.

తెలుగు అమ్మాయిల‌కు ఛాన్సులు ఇచ్చే నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఇండ‌స్ట్రీలో క‌రువ‌య్యారు. నాకు తెలిసిన మంచి అంద‌మైన తెలుగు అమ్మాయిలు వంద మంది వ‌ర‌కు ఉన్నారు. అయినా వారికి క్యారెక్ట‌ర్స్ ఇవ్వ‌డం లేదు. నేను అంద‌ర్నీ క‌ల‌వ‌డం మానేశా. పిలిస్తే పోతా.. లేక‌పోతే స‌ప్పుడుగాకుండా కూర్చుంటా. నానొక ఛాన్స్ ఇవ్వండి అని అడ‌గ‌డ‌మే మానేశా. గాయ‌త్రి షూట్ ఉంది. ఈ క్యారెక్ట‌ర్ చేస్తావా..? అని ఆడిష‌న్ ఇస్తేనే వారిని క‌లుస్తా.

ప‌లాన క్యారెక్ట‌ర్ నేను చేస్తే బాగుంటుంద‌న్న అవ‌కాశం వ‌స్తేనే చేస్తా. న‌టిగా రాణిద్దామ‌ని సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చా. హీరోయిన్‌గా చేయ‌డం క‌న్నా కామెడీ సినిమాలంటే ఇష్టం. ఎందుకంటే నాకు న‌వ్వించ‌డం.. న‌వ్వ‌డం అంటే ఇష్టం. తెలుగులో శ్రీ‌ల‌క్ష్మీ, కోవై స‌ర‌ళ వంటి మ‌హిళా క‌మెడియ‌న్లంటే ఇష్ట‌ప‌డతా. చంట‌బ్బాయి చిత్రంలోని చిరంజీవి వంటి క్యారెక్ట‌ర్స్ చేయాల‌న్న‌ది నా కోరిక‌.

స్వ‌త‌హాగా డైరెక్ష‌న్ చేసేందుకు ప్రొడ‌క్ష‌న్‌ను సిద్ధం చేస్తున్నా. రియాల్టీకి ద‌గ్గ‌ర‌గా, కామెడీ, స‌మాజాన్ని ప్ర‌భావితం చేసే రిలేష‌న్‌షిప్స్ మీద‌, ల‌వ్ అండ్ రొమాన్స్ వంటి స్టోరీలు రాయ‌డం అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని గాయ‌త్రి గుప్తా చెప్పుకొచ్చింది.

Next Story