టీడీపీ నేత గంటా ఆస్తుల వేలానికి రంగం సిద్ధం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Nov 2019 6:13 AM GMT
టీడీపీ నేత గంటా ఆస్తుల వేలానికి రంగం సిద్ధం..!

అమరావతి: ఏపీ మాజీ మంత్రి, విశాఖ నార్త్ టిడిపి ఎమ్మెల్యే గంటా ఆస్తి వేలానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేర ఇండియన్ బ్యాంక్ నుంచి భారీ రుణం తీసుకున్నారు. కాని..ఆ రుణం చెల్లించలేదు. దీంతో..ఆయన ఆస్తులను వేలం వేయడానికి ఇండియన్ బ్యాంక్‌ సిద్ధమైంది. డిసెంబర్‌ 20 వేలం వేయనున్నట్లు సమాచారం. మొత్తం రుణ బకాయిలు రూ. 209 కోట్లుగా తేల్చారు.తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ.35 కోట్ల 35 లక్షల 61 వేలు. మిగతా బకాయిల కోసం వ్యక్తి గత ఆస్తులు స్వాధీనం చేసుకునే హక్కు తమకుందని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ భూములు తనఖా పెట్టి భారీ రుణాలు తీసుకున్నారని గతంలో ఆరోపించారు. ఆరోపణలు ఈ రుణానికి సంబంధించినవి కాదని బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు.

గత ఎన్నికల్లో గంటా గెలిచినప్పటికీ..టీడీపీ ఘోర పరాజయం పొందింది. అప్పటి నుంచి రాజకీయంగా గంటా అంతా చురుగ్గా లేరు. బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నప్పటికీ..అవి ఎప్పటికప్పుడు తాజా కబుర్లుగానే మిగిలిపోతున్నాయి. మొత్తానికి గంటా శ్రీనివాసరావు రాజకీయంగా సంధియుగంలో ఉన్నారనే చెప్పాలి.

Next Story
Share it