ముఖ్యాంశాలు

  • డై అండ్ నైట్ టెస్ట్ లపై కోహ్లీని ఒప్పించిన గంగూలీ
  • మూడంటే మూడు సెకన్లలోనే ఒప్పించిన గంగూలీ
  • ఈ విషయాన్ని స్వయంగా చెప్పిన గంగూలీ

న్యూఢిల్లీ:నాయకుడు సరైన వాడు ఉంటే..నిర్ణయాలకు ఎవరైనా తల ఊపాల్సిందే. కోహ్లీ విషయంలో ఇప్పుడు అదే జరిగింది. ఇప్పటి వరకు డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లకు ససేమిరా అన్న కోహ్లీ..గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టగానే ఓకే అన్నాడు. డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ల విషయంలో గంగూలీనే కోహ్లీని ఒప్పించాడు. అదీ..మూడంటే మూడు సెకన్లలో. ఈ విషయాన్ని స్వయంగా మీడియాతో పంచుకున్నాడు.

కోహ్లీతో మీట్ అయిన మొదటసారి ఓ ప్రశ్న అడిగాను. డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ల గురించి అడిగాను. ముందు కెళ్దామని కోహ్లీ అన్నాడు. ఖాళీ స్టాండ్స్ మధ్య క్రికెట్ ఆడలేం కదా..?!. ఈ విషయాన్ని కోహ్లీ గ్రహించాడని గంగూలీ చెప్పాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.