చిత్తూరు జిల్లాలో కామాంధులు రెచ్చిపోయారు. తమ కామవాంఛను తీర్చుకునేందుకు 10వ తరగతి విద్యార్థినిని బలి పశువును చేశారు. ముగ్గురు వ్యక్తులు తమ కామకోరికను తీర్చుకునేందుకు చేసిన పని..ఆ విద్యార్థిని జీవితాన్ని నాశనం చేసింది. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలానికి చెందిన విద్యార్థినిపై ముగ్గురు కామాంధులు కన్నేశారు. ఆమె బహిర్భూమికి వెళ్లొస్తున్న సమయంలో..అడ్డగించి బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు అదే గ్రామానికి చెందిన సాయి, అంకయ్య, వీరాస్వామి. మానవత్వం మరిచి..తాము ఎక్కడున్నామో చూసుకోకుండా కామ వాంఛను తీర్చుకున్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది.

తనపై జరిగిన సామూహిక అత్యాచారానికి భయపడిన విద్యార్థిని కేకలు వేయడంతో..సమీపంలోని గ్రామస్తులు అప్తమత్తమై..ముగ్గురినీ పట్టుకుని చితకబాదారు. తర్వాత ఏర్పేడు పోలీసులకు అప్పచెప్పగా..వారు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రేణిగుంట సీఐ అంజు యాదవ్ ఏర్పేడు పీఎస్ కు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. సామూహిక అత్యాచారానికి గురైంది మైనర్ బాలిక కావడంతో ఇప్పటి వరకూ విషయం బయటికి పొక్కకుండా పోలీసులు రహస్య విచారణ చేసినట్లు తెలుస్తోంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.