ఎందుకు నోరు అదుపులో పెట్టుకోవు ఆఫ్రీది.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 May 2020 5:41 AM GMT
ఎందుకు నోరు అదుపులో పెట్టుకోవు ఆఫ్రీది.!

షాహిద్ ఆఫ్రీది.. ఎప్పుడు చూసినా భారత్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. తిట్లు తినడం. కాశ్మీర్ మాదేనంటూ నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం.. మన వాళ్ల చీవాట్లు తినడం. ఇది ఇప్పుడు మాత్రమే కాదు.. చాలా ఏళ్లుగా సాగుతున్న విషయమే..! ఏ మాత్రం నోటిని అదుపులో పెట్టుకోలేని షాహిద్ ఆఫ్రీది.. మరోసారి కాశ్మీర్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంట‌న్న పేద‌ల ప్ర‌జ‌ల‌కు త‌న ట్ర‌స్ట్ ద్వారా స‌హాయం చేసేందుకు ఆదివారం నాడు పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ లో ప‌ర్య‌టించాడు షాహిద్ ఆఫ్రీది. భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు. పాకిస్తాన్ సైన్యం ఏడు లక్షలు మాత్రమే.. భారత ప్రభుత్వం ఒక్క కశ్మీర్‌లోనే ఏడు లక్షలకుపైగా తన సైన్యాన్ని మోహరించింది. అయినా కశ్మీరీ పౌరులకు పాక్‌ సైన్యానికే మద్దతు తెలుపుతున్నారు. ప్రపంచమంతా కరోనా వ్యాధిపై పెద్ద పోరాటమే చేస్తోంది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మనస్సులో కరోనా కంటే ప్రమాదకరమైన వ్యాధి ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్ లోని భూభాగమేనంటూ ఆఫ్రీది చెప్పుకొచ్చాడు.



బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ట్విటర్ వేదిక‌గా ఘాటుగా రిప్లై ఇచ్చాడు. పాకిస్థాన్‌కు 7 లక్షల సైన్యం, 20 కోట్ల జనాభా ఉందని ఆఫ్రీది 16 ఏళ్ల పిల్లాడిలా మాట్లాడుతున్నాడు. అలాంటి దేశం గత 70 ఏళ్లుగా కశ్మీర్‌ కోసం బిచ్చమెత్తుకుంటోంది. ఆఫ్రీది, ఇమ్రాన్ ఖాన్, బాజ్వా లాంటి జోకర్లు భారత్‌కు, మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ పాక్ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. కానీ జడ్జ్‌మెంట్ డే వరకూ కశ్మీర్ పాక్‌కు దక్కదు. బంగ్లాదేశ్ గుర్తుంది కదా?’అని 1971 యుద్దాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ గంభీర్ ఘాటుగా ట్వీట్ చేశాడు. ఎంతో మంది క్రికెటర్లు కాశ్మీర్ విషయంలో ఇంకా ఆఫ్రీది వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడా అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు.

Next Story