మద్యం ప్రియులపై గంభీర్ ఫైర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 May 2020 11:41 AM GMT
మద్యం ప్రియులపై గంభీర్ ఫైర్

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని నిరోధించ‌డానికి దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ మే 17 వ‌ర‌కు పొడిగించిన సంగ‌తి తెలిసిందే. కాగా.. ఆరెంజ్‌, గ్రీన్ జోన్ల‌లో కొన్నింటికి కేంద్రం స‌డ‌లింపులు ఇచ్చింది. దీంతో సోమ‌వారం కొన్ని రాష్ట్రాల్లో మ‌ద్యం దుకాణాలు తెర‌చుకున్నాయి. దాదాపు 40 రోజుల త‌రువాత వైన్ షాపులు తెర‌వ‌డంతో.. మందు బాబులు మ‌ద్యం కోసం ఎగ‌బ‌డ్డారు. తెరిచిన కొద్ది సేప‌టి వ‌ర‌కు బాగానే ఉన్న త‌రువాత ప‌రిస్థితి చేయి దాటింది. క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో భౌతిక దూరాన్ని పాటించాల‌ని, మాస్కులు త‌ప్ప‌ని స‌రిగా ధ‌రించాల‌ని ఎంత చెబుతున్నా.. మందు బాబులు ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోలేదు.

క‌రోనా వ‌స్తే రాని మాకు మందే ప్ర‌ధానం అన్న‌ట్లుగా.. ఒక‌రిని ఒక‌రు తోసుకున్నారు. కొన్ని చోట్ల ప‌రిస్థితులు అదుపు త‌ప్ప‌డంతో పోలీసులు వైన్ షాపుల‌న్ని మూసివేయించాల్సి వ‌చ్చింది. కాగా.. ఈ ఘ‌ట‌న‌ల‌పై టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్‌, ఎంపీ గౌత‌మ్ గౌంభీర్ స్పందించారు. ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు ప్రాణాల కంటే మందే ముఖ్య‌మా..? అని ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. షాపుల వ‌ద్ద జనాలు బారులు తీరిన ఫోటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. . నెటిజన్లు కూడా మందుబాబుల తీరుపై మండిపడుతున్నారు. మందు ముందు కరోనా ఎంత అన్నట్టే ఉంది వీరి యవ్వారం చూస్తుంటే అని కామెంట్లు చేస్తున్నారు. మందు వంకతో వీరు మళ్లీ కరోనాను విజృంభించేలా చేస్తున్నారని అంటున్నారు..

Next Story