'గద్దలకొండ గణేష్' ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 24 Sept 2019 6:05 PM IST

గద్దలకొండ గణేష్ ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఎస్ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన 'గద్దలకొండగణేష్‌' సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి సూపర్‌హిట్‌ కలెక్షన్స్‌ తో దూసుకెళ్తోంది.

ఈ రోజు (సెప్టెంబర్ 24) 'గద్దలకొండ గణేష్' చిత్రాన్ని ప్రత్యేకంగా చూసిన మెగాస్టార్ చిరంజీవి వరుణ్ పెర్ఫార్మన్స్ చాలా బాగుందని. హరీష్ శంకర్ చాలా బాగా తీశాడు, డైలాగ్స్ చాలా బాగున్నాయని అన్నారు . ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మాతలు ఈ చిత్రాన్నితీశారని. సినిమాలో టీం స్పిరిట్ కనిపిస్తోందని ఆయన ప్రశంసిస్తూ ఈ అద్భుత విజయాన్ని సాధించిన టీం అందరికీ విజయాభినందనలు తెలిపారు.

Next Story