'గ‌బ్బ‌ర్' ఈజ్ బ్యాక్‌.. చిత‌కొట్టాడు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Dec 2019 2:11 AM GMT
గ‌బ్బ‌ర్ ఈజ్ బ్యాక్‌.. చిత‌కొట్టాడు..!

గ‌త‌ఏడాది కాలంగా గాయాలతో సతమతమ‌వుతూ టీమ్ లోకి వ‌స్తూ పోతూ ఉన్న టీమిండియా స్టార్ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్ అధ్బుత‌ సెంచరీతో త‌న పున‌రాగ‌మ‌నాన్ని ఘ‌నంగా ఛాటాడు. సుమారు15 నెలల తర్వాత తొలి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడుతున్న ధ‌వ‌న్ హైదరాబాద్‌ బౌలర్లకు చుక్క‌లు చూపించాడు.

నిన్న ఉద‌యం మొద‌లైన డిల్లీ, హైద‌రాబాద్ జ‌ట్ల మ్యాచ్‌లో అతనొక్కడే ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. తొలిరోజు ఆటలో ధ‌వ‌న్ (198 బంతుల్లో 137 బ్యాటింగ్‌; 19 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాది నాటౌట్‌గా నిలిచాడు. అయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని ఆంభంలో హైదరాబాద్‌ బౌలర్లు సిరాజ్‌ (2/60), మెహదీ హసన్‌ (3/61) కుదిపేశారు.

ఓ ద‌శ‌లో 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఢిల్లీని కెప్టెన్ ధవన్‌ ఆదుకున్నాడు. ఓ ప‌క్క‌ కీలక వికెట్లు నేల రాలుతున్న‌ బాధ్యతాయుత ఇన్నింగ్సు ఆడి క్రీజులో నిలిచాడు. డిల్లీ బ్యాట్స్‌మెన్‌ల‌లో నితీశ్‌ రాణా (25; 5 ఫోర్లు), అనూజ్‌ (29; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కున్వర్‌ (22 బ్యాటింగ్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) డ‌బ‌ల్ డిజిట్ స్కోరు చేశారు. ధ‌వ‌న్ ఆరో వికెట్‌కు రావత్‌తో కలిసి 84 పరుగులు.. ఏడో వికెట్‌కు కున్వర్‌తో క‌లిసి 57 పరుగులు సాధించాడు.

హైదరాబాద్‌ బౌలర్లలో సీవీ మిలింద్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. ఇదిలావుంటే తొలి రోజు ఆట ముగిశాక ఢిల్లీ ఆటగాడు కునాల్‌కు, హైదరాబాదీ ప్లేయర్‌ తన్మయ్‌ అగర్వాల్‌కు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) డోపింగ్‌ పరీక్షలు నిర్వహించింది.

Next Story
Share it