జగన్ చేతికి జీఎన్ రావు కమిటీ నివేదిక

By రాణి  Published on  20 Dec 2019 11:22 AM GMT
జగన్ చేతికి జీఎన్ రావు కమిటీ నివేదిక

ముఖ్యాంశాలు

  • నివేదికలో ఏముంది ?
  • నివేదికపై జగన్ కేబినెట్ తో చర్చిస్తారా ?
  • మూడు రాజధానులపై భిన్నాభిప్రాయాలు..!

అమరావతి : ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై జీఎన్ రావు కమిటీ తుది నివేదికను వైఎస్ జగన్ కు అందజేసింది. అసెంబ్లీలో రాష్ర్టానికి మూడు రాజధానులుండొచ్చని జగన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో...రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై నివేదిక కోసం జగన్ జీఎన్ రావు కమిటీని నియమించారు. ఇప్పటికే మధ్యంతర నివేదికను అందజేసిన కమిటీ...తాజాగా శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలో నివేదికను జగన్ కు అందజేసింది. రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిటీ..ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించింది. అలాగే వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన సుమారు 40 వేల వినతులను కమిటీ పరిశీలించింది. ఇప్పుడు కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నివేదిక గురించి జగన్ కేబినెట్ తో చర్చిస్తారా ? లేక నేరుగా కేంద్రం దృష్టికి తీసుకెళ్తారా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.

మూడు రాజధానులపై భిన్నాభిప్రాయాలు

జగన్ మూడు రాజధానుల ప్రకటనపై రాష్ర్ట వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నేతలు కూడా భిన్నాప్రాయాలు తెలియజేస్తున్నారు. కర్నూల్ లో, వైజాగ్ లో రాజధాని ఏర్పాటుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే..కోస్తాంధ్రలో మాత్రం అందుకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. కర్నూల్ లో రాజధాని ఏర్పాటు మంచి విషయమే అయినప్పటికీ...అది అమరావతి వికేంద్రీకరణ కాకూడదంటున్నారు బీజేపీ సీమ నేతలు. అటు వైజాగ్ రాజకీయ నేతలు కూడా అక్కడ రాజధాని ఏర్పాటుకు అనుకూలంగానే మాట్లాడినప్పటికీ...అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తుళ్లూరు ప్రాంతానికి చందిన రైతులతై..తమ ప్రాంతానికి ఎలాంటి కమిటీ సభ్యులు రాలేదని చెబుతున్నారు. ఎవరి నుంచి నిర్ణయాలు సేకరించి నివేదిక సమర్పించారని ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోసం భూములిస్తే...ఇప్పుడు తమ తలరాతను మార్చి నడి రోడ్డుపై నిలబెట్టారని వాపోతున్నారు.

Next Story
Share it