జర్నలిస్ట్‌లకు పూర్తి రక్షణ కల్పిస్తాం- డీజీపీ సవాంగ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2019 1:22 PM GMT
జర్నలిస్ట్‌లకు పూర్తి రక్షణ కల్పిస్తాం- డీజీపీ సవాంగ్

అమరావతి: ఏపీలో జర్నలిస్ట్ లకు పూర్తి రక్షణ కల్పిస్తామని డీజీపీ సవాంగ్ ఏపీయూడబ్ల్యూజే నేతలకు హామీ ఇచ్చారు. ఐజేయూ అధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే అంబటి సుబ్బరావు ఆధ్వర్యంలో జర్నలిస్ట్‌లు డీజీపీ సవాంగ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. జర్నలిస్ట్‌లపై జరుగుతున్న దాడులను సవాంగ్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే...విచారణలో జరుగుతున్న లోపాలను కూడా ఎత్తి చూపారు. తునిలో సత్యనారాయణ హత్య, శ్రీకాకుళం జిల్లా జులుమూరు రిపోర్టర్ కరుణ వీరుడు పై జరిగిన దాడిని వివరించి, స్థానిక పోలీసుల వైఫల్యాలను వివరించి దర్యాప్తు అధికారులు ను మార్చాలని డిమాండ్ చేశారు. చీరాల, నెల్లూరుల్లో జర్నలిస్ట్‌లపై జరిగిన దాడుల గురించి కూడా డీజీపీకి చెప్పారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవటం జరుగుతోందని జర్నలిస్ట్ సంఘాలకు డీజీపీ హామీ ఇచ్చారు.

Next Story