అంతరిక్షం నుంచి ఓటు వేసిన అమెరికన్ వ్యోమగామి

By సుభాష్  Published on  26 Oct 2020 8:06 AM GMT
అంతరిక్షం నుంచి ఓటు వేసిన అమెరికన్ వ్యోమగామి

ఓటు హ‌క్కు ఎంతో ముఖ్య‌మ‌నే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. కొంద‌రు ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డానికి దూరాన్ని సైతం

లెక్కచేయ‌కుండా వ‌చ్చి ఓటు వేస్తుండ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం ఇది త‌మ‌కు ప‌ట్ట‌ని వ్య‌వ‌హారంగా నిర్ల‌క్ష్యంగా ఉంటారు. అయితే.. ఒక్క

ఓటుతో ఓటమి పాలైన నాయ‌కులు ఎంద‌రో ఉన్నారు. ఇక అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు అంటే మాట‌లా..? న‌వంబ‌ర్ 3 నుంచి ఈ

ఎన్నిక ప్రారంభం కానుంది. ఒక్కో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉండ‌డంతో.. సుదూర ప్రాంతాల్లో ఉన్న‌వారు రావ‌డానికి వీలుప‌డ‌ని సంద‌ర్భాల్లో..

అలాంటి వారి కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పిస్తారు.

అమెరికన్ మహిళా వ్యోమగామి కేట్ రూబిన్స్ అంతరిక్ష కేంద్రం నుంచి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నవంబరు 3 న అమెరికా

అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు గాను ఆమె అప్పుడే తన ఓటు వేసేశారు. ఆ రోజున తాను రోదసిలోనే ఉంటానని

కేట్ పేర్కొన్నారు. ఈ అంతరిక్ష కేంద్రం భూతలానికి సుమారు 200 మైళ్లకు పైగా దూరంలో ఉంది. సెల్ఫీ తీసుకున్న ఆమె.. ట్వీట్ కూడా

చేస్తూ.. ఈ నెల 14 న తాను కక్ష్యలో ప్రవేశించినట్టు తెలిపారు. మరో ఆరున్నర నెలల పాటు ఆమె ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే

ఉండనున్నారు.

అక్టోబర్ 14న కేట్ రుబిన్స్ అంతరిక్షంలోకి వెళ్లారు. మరో కొన్ని నెలలపాటు అక్కడే ఉండనున్నారు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్

నుంచి అక్టోబర్ 23న ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతరిక్షం నుంచి ఓటు హక్కును తొలిసారిగా 1997లో కల్పించారు.

1997లో తొలిసారిగా డేవిడ్ వోల్ఫ్ అనే ఆస్ట్రోనాట్ అంతరిక్షం నుంచి ఓటు వేశారు. ఇంటర్నేషనల్ స్పెస్ స్టేషన్‌లో ఉండే వ్యోమగాములు

ఫెడరల్ పోస్ట్ కార్డు అప్లికేషన్ ద్వారా వ్యోమగాములు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

అమెరికా పౌరులు ఓటు హక్కును వినియోగించుకోవాలని కేట్ రుబిన్ పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం

ఉందన్నారు. నాసా వీడియో తమ యూట్యూబ్ ఛానల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.



Next Story