మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2019 3:07 PM GMT
మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం

  • చెన్నై అపోలో ఆస్పత్రిలో మాజీ ఎంపీ శివ ప్రసాద్
  • పరిస్థితి విషమం అంటోన్న ఆస్పత్రి వర్గాలు
  • ఆందోళనలో శివ ప్రసాద్ కుటుంబ సభ్యులు

చెన్నై: చిత్తూరు మాజీ ఎంపీ, ప్రముఖ సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత శివప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉంది. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ చిత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. అయితే, శివప్రసాద్ ఆరోగ్యం మాత్రం విషమంగా ఉన్నట్టు బంధువుల ద్వారా తెలుస్తోంది.

శివప్రసాద్ 2009, 2014 లలో వరుసగా రెండుసార్లు చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. స్వతహాగా నటుడైన శివప్రసాద్ తన నిరసనలను కూడా విచిత్రమైన వేషధారణలతో తెలిపేవారు. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ ఎదుట రకరకాల వేషధారణల్లో నిరసనలు తెలిపి జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు.

Next Story