మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

By సుభాష్  Published on  5 April 2020 2:27 AM GMT
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

చిత్తూరు జిల్లా పుంగనూరు మాజీ ఎమ్మెల్యే రాణి సుందరమ్మ (95) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మరణించారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం పుంగనూరులో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కాగా, 1970లో జరిగిన ఉప ఎన్నికల్లో రాణి సుందరమ్మ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. 1972లో సాధారణ ఎన్నికల్లో రెండో పర్యాయం ఆమె అసెంబ్లీలో అడుగు పెట్టారు. నాటి నుంచి నేటి వరకు పుంగనూరుకు మహిళా ఎమ్మెల్యే ఆమె ఒక్కరే. 1978లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం వీరి కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. ప్రతియేటా నిర్వహించే సుగుటూరు గంగమ్మ జాతరకు వచ్చి పూజలు నిర్వహించేవారు.

Next Story
Share it