నిరవధిక దీక్షకు సిద్ధమైన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2019 3:56 PM GMT
నిరవధిక దీక్షకు సిద్ధమైన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం: ఇసుక కృత్రిమ కొరతపై 36 గంటల నిరవధిక దీక్షకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. ఈ నెల 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8గంటల వరకు కోనేరుసెంటర్ లో నిరవదిక దీక్షకు కొల్లు రవీంద్ర కూర్చొనున్నారు. ఇసుక కొరతపై రేపు టిడిపి చేపట్టే 36 గంటల నిరవధిక దీక్షకు వ్యతిరేకంగా కోనేరు సెంటర్లో ధర్నా కు పిలపునిచ్చారు వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు. ఇరుపార్టీలు ఆందోళనకు పిలుపునివ్వడంతో మచిలీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫ్రీ ఇసుక పేరుతో దోచుకున్నారని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అందుకే..కొత్త ఇసుక ఫాలసీని తీసుకొచ్చామని చెబుతున్నారు. ప్రస్తుతం వరదలు వస్తుండటంతో ఇసుక తీయడం కష్టంగా ఉందని ప్రభుత్వం అంటోంది. కొత్త ఇసుక రీచ్ లు కూడా రెడీ అయ్యాయని..వరదల తగ్గగానే ఇసుక కొరత లేకుండా చూస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలోనే చెప్పారు. అయితే..ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. దీంతో నిర్మాణ రంగం కుదేలై..వేల మంది పని కోల్పోయారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

Next Story