చెన్నై: బోరుబావిలో మృతి చెందిన చిన్నారి సుజిత్ పట్ట రాజకీయ నేతలు, కోలీవుడ్ స్టార్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 25న తమిళనాడులోని తిరుచ్చిలో తన అన్నతో ఆడుకుంటూ చిన్నారి సుజిత్ బోరు బావిలో పడ్డాడు. సుజిత్ ను కాపాడటానికి మూడు రోజులు విరామంలేకుండా ప్రయత్నించారు. మొదటి 35 అడుగుల లోతులో ఉన్న సుజిత్..తరువాత 90 అడుగులకు జారిపోయాడు. మూడు రోజుల తరువాత సుజిత్ చనిపోయాడని అధికారులు ప్రకటించారు.సుజిత్ మరణం తమిళనాడునే విషాదంలో ముంచింది. కోలీవుడ్ స్టార్లు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

- సుజిత్ కు నా సంతాపం, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి అన్నారు విశాల్

- మమ్మల్ని క్షమించు సుజిత్ అంటూ సమంత వేడుకుంది.

- సజిత్ ఆత్మ శాంతించాలి చిన్మయి కోరుకుంది.

-నిర్లక్ష్యం వలనే సుజిత్ ప్రాణాలు పోయాయన్నారు డిఎంకే అధినేత స్టాలిన్

-చిట్టి తండ్రి మమ్మల్ని క్షమించు అంటూ వేడుకుంది రజనీ కాంత్ కూతురు సౌందర్య

- భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు అంటూ భావోద్వేగంతో చెప్పింది గౌతమి

ఇక..అన్ని పార్టీల రాజకీయ నేతలు సుజిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సుజిత్ మృతదేహంపై పూలు చల్లి నివాళులు అర్పించారు.న్యూస్‌మీటర్ తెలుగు

Next Story