తుంగభద్ర దగ్గర కృష్ణమ్మ పరవళ్లు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Oct 2019 11:56 AM ISTఅనంతపురం: మరోసారి తుంగభద్ర డ్యామ్‌కు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 2019 సంవత్సరంలో నాలుగో సారి అధికారులు డ్యామ్ గేట్లు ఎత్తారు. 33 గేట్ల ద్వారా రెండు అడుగుల మేరకు లక్ష యాభై వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. దీంతో తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తంగభద్ర నుంచి శ్రీశైలానికి భారీగా వరద నీరు చేరుతున్నది. మరో వైపు ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి గరిష్టంగా వరద నీరు వచ్చి చేరింది. 12 గేట్లు ఎత్తి 37 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. దాదాపు మూడేళ్ల తర్వాత శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్ని అధికారులు ఎత్తివేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 45 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు ప్రస్తుత, పూర్తి స్థాయి నీటి నిల్వలు 90.313 టీఎంసీలుగా ఉంది.