ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం మరోసారి మొబైల్స్‌పై బంఫర్‌ ఆఫర్లు ప్రకటించింది. దసరా, దీపావళి, సంక్రాంతి పేరిట భారీ డిస్కౌంట్‌ను ప్రకటించే ఫ్లిఫ్‌కార్ట్‌.. ఈ సారి ఏమి లేకుండానే మొబైల్స్‌పై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు ‘మొబైల్స్‌ బొనాంజా’ పేరిట ఈ సేల్‌ కొనసాగనుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేసే మొబైల్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ లభించనుంది.

యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులపై కొనుగోలు చేస్తే 10 శాతం రాయితీ కూడా లభించనుంది. ఐదు రోజుల పాటు ఈ సాగే ఈ సేల్‌లో పలు మొబైల్స్‌ కొనుగోలుపై ఎక్ఛేంజ్‌ ఆఫర్లు కూడా ఉన్నాయి. శాంసంగ్‌ కొత్త మొబైళ్లపై మంచి డిస్కౌంట్లు లభించనున్నాయి. రూ.26,999 ధరగా ఉన్న శాంసంగ్‌ ఎస్‌9.. ఇప్పుడు రూ.22,999కే అందుబాటులోకి వచ్చింది. అలాగే శాంసంగ్‌ ఏ50 రూ.14,999 ధర ఉండగా.. ఈ సేల్‌లో రూ.12,999కే వస్తోంది. శాంసంగ్‌ ఎస్‌9+.. రూ.27,999కే లభించనుంది.

అలాగే శాంసంగ్‌ ఎస్‌10, ఎంఐ ఏ3, ఒప్పో రీనో, రియల్‌మీ ఎక్స్‌టీ ప్రో, వివో జడ్‌1 ప్రో వంటి మొబైల్స్‌ప కూడా ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్లు ప్రకటించింది. ప్రముఖ యాపిల్‌ దిగ్గజానికి చెందిన ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ 64 జీవీ వేరియంట్‌ను రూ.54,999కి అందిస్తోంది. రియల్‌ మీ5, రియల్‌మీ 3లపై కూడా డిస్కౌంట్‌ లభించనుంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.