జాతీయ జెండాను త‌ల‌క్రిందులుగా ఎగుర వేసిన మంత్రి

By Newsmeter.Network  Published on  26 Jan 2020 8:06 AM GMT
జాతీయ జెండాను త‌ల‌క్రిందులుగా ఎగుర వేసిన మంత్రి

విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించిన రిపబ్లిక్ డే వేడుక‌ల్లో అప‌శృతి చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ ఆధ్వరంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి అవంతి శ్రీనివాస్‌ జాతీయ జెండాను ఎగరేశారు. కానీ ఆయన పొరబాటున జాతీయ జెండాను తలకిందులుగా ఎగరేశారు. అంతే కాదు ఈ విష‌యాన్ని గుర్తించ‌కుండా జాతీయ‌గీతాన్ని కూడా ఆల‌పించారు. కాసేప‌టి అనంత‌రం త‌ప్పిదాన్ని గుర్తించి జెండాను కింద‌కు దించి స‌రి చేశారు.

కాగా ఈ వీడియో ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన టీడీపీ శ్రేణులు.‘‘భారత జాతీయ జెండాని కూడా రివర్స్ లో ఎగరేసి అవమానించిన వైకాపా మంత్రి అవంతి శ్రీనివాస్.. ఇప్పుడు మన ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని కూడా రివర్స్ లోకి తీసుకెళ్తుంది’’ అని పోస్టులు పెడుతున్నారు.

న‌ర్సీప‌ట్నంలో..

విశాఖ జిల్లాలోని నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తుండగా స్తంభంపై ఉన్న చక్రం విరిగి జాతీయ జెండా కిందపడింది. అనంతరం మళ్లీ సరిచేసి జాతీయ జెండా ఎగరేశారు.Flag Hoisting In vizag

Next Story