చనిపోయిన మాజీ కబడ్డీ జిల్లా క్రీడాకారుడి కుటుంబానికి ఆర్థిక సాయం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Nov 2019 12:10 PM GMT
చనిపోయిన మాజీ కబడ్డీ జిల్లా క్రీడాకారుడి కుటుంబానికి ఆర్థిక సాయం

సూర్యాపేట: నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో మాజీ కబడ్డీ జిల్లా క్రీడాకారుడు ఆత్మహత్మ చేసుకొని మృతి చెందాడు. దీంతో అతని కుటుంబం రోడ్డున పడింది. ఇల్లుగడవని దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబాన్నిఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు ఆర్థిక సాయం అందించారు. ఆయనతో పాటు హైదరాబాద్ కి చెందిన మానవతావాది ఎడ్ల.కృష్ణారెడ్డి పెద్దమనసుతో..రూ. 10వేల ఆర్థిక సాయం అందించారు. ఈ డబ్బును సైదులు ఇద్దరు ఆడపిల్లల పేరుతో చెరొక రూ. 5 వేల చొప్పున పోస్ట్ ఆఫీసులో ఫిక్స్డ్ డిపాసిట్ చేయాలని ఆ కుటుంబాన్ని కోరారు. ఈ మేరకు డబ్బును ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు వారి కుటుంబ సమక్షంలో పిల్లలకు అందించడం జరిగింది.

Next Story
Share it