నిర్భయ దోషుల ఉరిపై డెత్ వారెంట్ కేసు తుది విచారణ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరి తీయడం హై కోర్టు కుదరనడంతో..హైకోర్టును సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంలో పిటిషన్ వేసింది. అలాగే దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ క్షమాభిక్ష రివ్యూ పిటిషన్ పై కూడా రేపే తీర్పు రానుంది. హై కోర్టు ఇచ్చిన తీర్పుపై రేపు సుప్రీం కోర్టు తుది విచారణ చేసి తీర్పునివ్వనుండటంతో పటియాలా కోర్టు న్యూ డెత్ వారెంట్ ఇచ్చేందుకు నిరాకరించింది. మరోవైపు నిర్భయ తల్లి కూడా దోషులను ఉరి తీయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఫిబ్రవరి 2నే నిర్భయ దోషులను ఉరి తీయాల్సి ఉండగా..నిందితుల్లో ఒకరికి సంబంధించిన పిటిషన్ పెండింగ్ లో ఉండటంతో ఆ డెత్ వారెంట్ పై పటియాలా కోర్టు స్టే విధించింది. దీనిని సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది. పిటిషన్ పై విచారణ చేసిన సుప్రీం తుది విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. నిర్భయ దోషులను వెంటనే ఉరి తీయాలంటూ ఢిల్లీ పౌరులు కూడా నిరసన చేశారు. పటియాలా కోర్టు తీరుపై యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్భయ నిందితులు కూడా చాలా తెలివిగా శిక్ష సమయం దగ్గరపడేకొద్దీ..పిటిషన్లు పెట్టుకుంటున్నారు. వినయ్ శర్మ పిటిషన్ పై తుది తీర్పు వస్తే..నిందితుల ఉరికి డేట్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.