ఫిలింక్రిటిక్స్ సంక్షేమానికి నిర్మాతల సాయం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Nov 2019 11:25 AM GMT
ఫిలింక్రిటిక్స్ సంక్షేమానికి నిర్మాతల సాయం

ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ కి మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు, స‌భ్యుల్లో ఉత్సాహం నింపిన సంగ‌తి తెలిసిందే. ఈ అసోసియేష‌న్ స‌భ్యుల హెల్త్ కార్డ్స్ , గోల్డెన్ జూబ్లీ వేడుకలు, సంక్షేమ కార్య‌క్ర‌మాల కోసం క‌మిటీ కృషి చేస్తోంది.

ఈ సంస్థకు ప‌్రముఖ దర్శకులు సురేందర్ రెడ్డి, 'ఉలాలా ఉలాల' నిర్మాత‌ గురురాజ్ రూ.లక్ష సాయం అందించారు. అలాగే 'తిప్ప‌ర మీసం' హీరో శ్రీవిష్ణు సమక్షంలో నిర్మాతలు రిజ్వాన్, అచ్యుత రామారావు కూడా రూ. 2 లక్షల సాయం అందించారు. ఈ స‌హాయానికి ఫిలింక్రిటిక్స్ అధ్య‌క్షుడు సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి ఇ.జ‌నార్థ‌న్ రెడ్డి వారికి ధ‌న్య‌వాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసెంట్ వాసు, ట్రెజరర్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story