కేవలం మహిళా వ్యోమగాములతో స్పేస్ వాక్ ప్రారంభం
By సత్య ప్రియ Published on 18 Oct 2019 11:02 AM GMTనాసాకు చెందిన క్రిస్టినా కోచ్, జెస్సికా మెయిర్ నేడు స్పేస్వాక్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో పురుషులు లేని పూర్తి మహిళా వ్యోమగాముల బృందంగా ఈ జోడీ చరిత్ర సృష్టిస్తోంది.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసాకు చెందిన ఇద్దరు మహిళా వ్యోమగాములు చరిత్ర సృష్టించనున్నారు. పురుషులెవరూ లేకుండా క్రిస్టినా కోచ్, జెస్సికా మెయిర్‌లు వీరు చేస్తున్న స్పేస్ వాక్ మోదోలయ్యింది. ఈ సాహసం చేసిన పూర్తి స్థాయి తొలి మహిళా బృందంగా వీరు చరిత్ర సృష్టించనున్నట్లు నాసా ట్వీట్ చేసింది.
ఈ స్పేస్ వాక్ ను చూడాలనుకుంటే కింది లింకు ను క్లిక్ చేయండి:
50ఏళ్ల నుంచి ఇప్పటివరకు 420 సార్లు స్పేస్‌వాక్ చేయగా....వారిలో పురుష వ్యోమగాములే ఎక్కువగా ఉన్నారు. కానీ ఇవాళ జరిగే 421వ స్పేస్‌వాక్‌లో పురుషులెవ్వరూ ఉండరు. నలుగురు సభ్యుల పురుష వ్యోమగాములు.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోనే ఉంటారు. మహిళా వ్యోమగాములైన క్రిస్టినా కోచ్, జెస్సికా మెయిర్ అంతరిక్షంలో స్పేస్‌వాక్‌చేసి.. ఐఎస్ఎస్లో బ్యాటరీ లోపాలను సరిచేయనున్నారు.
గతవారం కోచ్‌తోపాటు మరో పురుష వ్యోమగామి బ్యాటరీలను అమర్చారు. కంట్రోల్ వ్యవస్థలో సమస్య తలెత్తినందున మిగిలిన వాటి అమరికను నిలిపివేశారు. ప్రస్తుతం ఆ లోపాన్ని సరిదిద్దడానికి స్పేస్‌వాక్ చేయనున్న ఇద్దరు మహిళా వ్యోమగాములు మూడు రోజులుగా సన్నద్ధమవుతున్నారు.