రైతుల రుణమాఫీ పథకం రద్దుపై మండిపడ్డ యనమల

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2019 2:36 PM GMT
రైతుల రుణమాఫీ పథకం రద్దుపై మండిపడ్డ యనమల

అమరావతి: రైతులకు రుణ ఉపశమనం ఇచ్చే జీవో 38ను రద్దు చేయడం దారుణమన్నారు యనమల. ఇది రైతులకు ద్రోహం చేయడమేనన్నారు. 33లక్షల మంది రైతులకు రూ.7,582 కోట్లను ఇవ్వకపోవడం గొడ్డలిపెట్టు అన్నారు. ఏ ప్రభుత్వమేనా పేదలకు పెట్టడంలో పోటీ పడాలన్నారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం రైతుల పొట్టగొట్టంలో పోటీ పడుతుందన్నారు. 4వ విడతకు సంబంధించి 2లక్షల మంది ఖాతాల్లో రూ.376కోట్లు ఇప్పటికే జమ పడ్డాయన్నారు. మిగిలిన రూ.3,603కోట్లతో పాటు.. 5వ విడత రూ.3,979కోట్లు చెల్లించాలన్నారు. ఇలా..గత ప్రభుత్వాలు స్కీంలు రద్దు చేసిన సందర్భంలేదని లేఖలో పేర్కొన్నారు మండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు యనమల.

Next Story
Share it