ఎమ్మెల్యే కనబడుట లేదు..!
By సుభాష్ Published on 23 Dec 2019 6:54 PM ISTఏపీలోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదని మంగళగిరి పోలీసుస్టేషన్ ఫిర్యాదు చేశారు రైతులు. కాగా, సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు ప్రకటించిన నేపథ్యంలోరైతులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఇక ఆందోళనలు జరుగుతున్నప్పటి నుంచి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కనిపించడం లేదని, వెతికి పెట్టాలని రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రాజధానుల ప్రకటనపై తాము ఏదైన చెప్పుకొందామంటే మా ఎమ్మెల్యే ఎక్కడున్నారో కనిపించడం లేదని వారు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ఎమ్మెల్యే కనిపించకపోవడంపై ఎంతో ఆందోళనలోఉన్నాం..మా ఎమ్మెల్యేను మాకు అప్పగించండి అంటూ రైతులు చెప్పుకొచ్చారు. గత వారం నుంచి ఎమ్మెల్యే నియోజకవర్గంలో గానీ, ఆయన కార్యాలయంలో గానీ, నివాసంలో గానీ ఎక్కడ కనిపించడం లేదని, మా సమస్యలు చెప్పుకొందామంటే కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాజధాని రైతులు సంతకాలు చేసి ఇచ్చారు.