టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కార్యాలయాలు, ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా రాయపాటికి ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులమంటూ అగంతకులు ఫోన్‌ చేశారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తే సీబీఐ కేసుల నుంచి తప్పిస్తామంటూ రాయపాటిని బురిడి కొట్టే ప్రయత్నం చేశారు. సీబీఐ కేసుల నుంచి తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పుకొచ్చారు అగంతకులు. దీంతో ఫోన్‌కాల్‌పై ఢిల్లీ సీబీఐలో ఫిర్యాదు చేసినట్లు రాయపాటి చెప్పారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు ఫోన్‌ కాల్‌ చేసింది హైదరాబాద్‌కు చెందిన మణివర్ధన్‌రెడ్డి, చెన్నైకి చెందిన సిల్వంగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మణివర్ధన్‌రెడ్డి, సెల్వంలు ఇలా చాలా మందిని బెదిరించినట్లు సీబీఐ అధికారుల విచారణలో తేలింది. ఇద్దరి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లలో బెదిరింపులకు సంబంధించిన కొన్ని వాట్సాప్‌ మేసెజ్‌లను రికవరీ చేశారు అధికారులు.

కాగా, ఇటీవల రాయపాటి సాంబశివరావుకు ఇల్లు, కార్యాలయాలపై సీఐబీ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.  హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, బెంగళూరు ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించి రాయపాటిపై కేసున మోదు చేశారు. సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ ట్రాయ్‌ సంస్థలో పెద్ద మొత్తంలో సోదాలు జరిపిన సీబీఐ అధికారులు.. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారం పేరుతో పెద్ద మొత్తంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో ఈ దాడులు నిర్వహించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.