హైదరాబాద్‌: అమీర్‌పేట అన్నపూర్ణ బ్లాక్ లో నకిలీ సీబీఐ అధికారులు హల్ చల్ చేశారు. ఐదో అంతస్తులో ఉన్న జగదీష్ అనే జ్యోతిష్యుడి కార్యాలయానికి వెళ్లారు. తాము సీబీఐ అధికారులమంటూ ఆరుగురు హల్ చల్ చేశారు. తనిఖీల పేరుతో సోదాలు చేశారు. చివరకు జ్యోతిష్యుడి జగదీష్ దగ్గర నుంచి 25 తులాల బంగారంతో పరారయ్యారు. ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story