నిజనిర్ధారణ : డ్యూరెక్స్‌కీ జె.ఎన్‌.యూ అల్లర్లకూ ఎలాంటి సంబంధం లేదు..!

By Newsmeter.Network  Published on  13 Jan 2020 11:24 AM GMT
నిజనిర్ధారణ : డ్యూరెక్స్‌కీ జె.ఎన్‌.యూ అల్లర్లకూ ఎలాంటి సంబంధం లేదు..!

ముఖ్యాంశాలు

  • డ్యూరెక్స్ కంపెనీ యాడ్స్ పేరుతో ఉన్నవి అబద్ధపు ప్రచారం
  • స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించిన డ్యూరెక్స్ కంపెనీ
  • అసలు అలాంటి యాడ్స్ తయారు చేయలేదని వివరణ
  • తమ కంపెనీకి ఆ యాడ్స్ తో ఎలాంటి సంబంధం లేదని వివరణ
  • న్యూస్ మీటర్ నిజనిర్ధారణ, పరిశోధనలో వెల్లడైన నిజాలు

హైదరాబాద్ : దేశం మొత్తాన్నీ ఉపేస్తున్న సిఎఎ గందరగోళం విషయంలో ఓ కండోమ్ తయారీ కంపెనీ లోగోతో ఉన్న రెండు గ్రాఫిక్ కార్డులు సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారంలో ఉన్నాయి. బి.జె.పి ప్రభుత్వాన్ని నేరుగా విమర్శిస్తూ ఈ కండోమ్ తయారీ లోగోను వాడుకోవడం ఇప్పుడు వివాదాస్పదమైన అంశంగా మారింది. అలాగే ఢిల్లీ జె.ఎన్.యూ గొడవలకు సంబంధించి కూడా ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ కార్డ్స్ ప్రచారమవుతున్నాయని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.

చాలామంది ట్విట్టర్ యూజర్లు వెనకాముందూ చూసుకోకుండా ఈ యాడ్స్ ని పూర్తిగా సర్క్యలేట్ చేసేశారు. ఓ ట్విట్టర్ యూజరైతే నేరుగా అసలు ప్రస్తుతం అధికారంలో ఉన్నవారికీ, ఈ కండోమ్ తయారీ కంపెనీకి ఉన్న సంబంధం ఏంటో అర్థం కాకపోయినా మొత్తానికి యాడ్ మాత్రం చూడ్డానికి చాలా ముచ్చటగా ఉందంటూ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది.

అసలు ఢిల్లీ పోలీసులకంటే డ్యూరెక్స్ కండోమ్ చాలా బాగా పనిచేస్తుందని నిరూపితమయ్యిందనీ, దానికి ఢిల్లీ పోలీసులు సిగ్గుతో తల దించుకోవాలనీ కామెంట్ పాస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి తలాతోకాలేని అసంబద్ధమైన కామెంట్లు అసలు ప్రచారంలో ఉన్న యాడ్స్ కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాయని అధికారులు అంటున్నారు.



నిజనిర్థారణ :

డ్యూరెక్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మొత్తంగా ఆ పోర్టల్ లో ఎక్కడా అసలు అలాంటి యాడ్ లేనేలేదని తేలింది. న్యూస్ మీటర్ టీమ్ డ్యూరెక్స్ యాడ్స్ అన్న కీవర్డ్ తో సెర్చ్ చేసినప్పుడు ఇంటర్ నెట్ లో అలాంటి అడ్వర్టైజ్ మెంట్లను తయారుచేయడానికి వీలున్న టెంప్లేట్స్ కనిపించాయి.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే డ్యూరెక్స్ కంపెనీ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో అసలు తాము అలాంటి యాడ్స్ ఎక్కడా పోస్ట్ చేయలేదనీ, తయారుచేయలేదనీ వివరణ ఇచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాపీరైట్ హక్కుల్ని, చట్టాలను ఉల్లంఘించి తమ బ్రాండ్ లోగోను స్వప్రయోజనాలకోసం వాడుకున్నట్టుగా తెలిసిందని కంపెనీ సోషల్ మీడియా పోస్టుల్లో స్పష్టంగా తెలిపింది.

పైగా దీనివల్ల తమ కంపెనీకి చాలా నష్టం కలుగుతోందని కూడా పేర్కొంది. అంటే నిజంగానే అసలు డ్యూరెక్స్ కంపెనీకి జెఎన్ యు విద్యార్థులు చేస్తున్న యాంటీ సి.ఎ.ఎ ఆందోళనలకూ ఎలాంటి సంబంధం లేదని, అసలా యాడ్స్ ని డ్యూరెక్స్ కంపెనీ తయారు చేయలేదనీ తేలింది.



Next Story