స్విట్జర్లాండ్ ఎలక్ట్రిక్ వాహనాలను బ్యాన్ చేసిందా?!
స్విట్జర్లాండ్ ఈ శీతాకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి వీలు లేదని ప్రకటించింది
By Nellutla Kavitha Published on 9 Dec 2022 12:52 PM IST"ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ వాహన వినియోగానికి ముందడుగులు వేస్తుంటే, స్విట్జర్లాండ్ మాత్రం తమ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఆపేయడానికి సిద్దపడింది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ఆ దేశం నిషేదించింది. స్విట్జర్లాండ్ ఈ శీతాకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి వీలు లేదని ప్రకటించింది"…అంటూ మీడియాలో ఒక వార్త పబ్లిష్ అయ్యింది.
https://telugu.drivespark.com/off-beat/switzerland-might-become-first-country-to-ban-electric-vehicles-reason-021305.html?content=liteversion&ref=fb-instant
ఇదే వార్తను సోషల్ మీడియాలో వైరల్గా సర్క్యులేట్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను బ్యాన్ చేసిన స్విట్జర్లాండ్..దీని వెనుక ఇంత కథ ఉందా..!! అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ అయింది వార్త.
నిజ నిర్ధారణ
నిజంగానే ఎలక్ట్రిక్ వాహనాలను స్విట్జర్లాండ్ దేశం బ్యాన్ చేసిందా? ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. గూగుల్ కీవర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు ఈ వార్తకు సంబంధించి విదేశీ వార్తా సంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ ఇంటర్నెట్లో కనిపించాయి. డెయిలీ మెయిల్ ప్రకారం శీతాకాలంలో ఏర్పడే విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడానికి స్విట్జర్లాండ్ దేశం ఎమర్జెన్సీ ప్లాన్ రూపొందించుకుంది. ఇక్కడ 60 శాతం విద్యుత్తు హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ల ద్వారా వస్తుంది. మిగతా సీజన్లలో ఈ దేశం విదేశాలకు విద్యుత్తును ఎగుమతి చేస్తుంది. అయితే శీతాకాలంలో నీరు గడ్డకట్టడం వల్ల విద్యుత్ ఉత్పత్తిలో ఆటంకం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో శీతాకాలంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలనుకున్నా, రష్యా - ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో అది సాధ్యపడని విషయం కాబట్టి శీతాకాలంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి ఎమర్జెన్సీ ప్లాన్ సిద్ధం చేసుకుంది స్విట్జర్లాండ్. రాబోయే నెలల్లో వచ్చే ఇంధన సంక్షోభాన్ని ముందుగానే ఊహించి ఎమర్జెన్సీ ప్లాను సిద్ధం చేసింది ప్రభుత్వం. దీని ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వాడకూడదు. అలాగే విద్యుత్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని క్రిస్మస్ లైటింగ్ కూడా ఆఫ్ చేయాలని ప్రతిపాదనలు చేశారు.
దేశంలో బ్లాక్ ఔట్ జరగకుండా ఉండడానికి క్రైసిస్, ఎమర్జెన్సీ పేరుతో రెండు దశల్లో ఎమర్జెన్సీ ప్లాన్ సిద్ధం చేసుకుంది స్విట్జర్లాండ్.
https://www.foxbusiness.com/politics/switzerland-could-ban-electric-vehicle-use-during-energy-crisis-reports
అయితే ఈ ఆంక్షలన్నీ కేవలం ప్రతిపాదనల స్టేజీలో మాత్రమే ఉన్నాయి. ఈ ఆంక్షలను అమలు పరచడానికి ఒక టైం టేబుల్ నిర్ధారించలేదు స్విట్జర్లాండ్. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పరిమితం చేయడం లెవెల్ 3 ఫేస్ లో వస్తుంది. అంటే అతి తీవ్రమైన స్థాయిలో విద్యుత్తును పొదుపు చేసే పరిస్థితి.
https://www.drive.com.au/news/switzerland-considers-ev-bans-during-power-shortages/
ఇందుకోసం స్విట్జర్లాండ్ దేశం Ordinance on Restrictions and Prohibitions on the Use of Electric Energy అనే డ్రాఫ్ట్ ను తయారు చేసి, సంప్రదింపుల కోసం పంపించింది. https://www.admin.ch/gov/de/start/dokumentation/medienmitteilungen.msg-id-91881.html
సో, ఎలక్ట్రిక్ వాహనాలను స్విట్జర్లాండ్లో బాన్ చేశారు అనే వార్త మిస్ లీడింగ్. విద్యుత్ సంక్షోభం escalation స్టెప్ 3 కి చేరుకున్నప్పుడు మాత్రమే, అత్యవసర సందర్భాల్లో కొన్ని పరిమితులు విధిస్తారు